అమెరికాకు భారత్ ఆఫర్

15-02-2020

అమెరికాకు భారత్ ఆఫర్

భారతీయ పౌల్ట్రీ, డైయిరి మార్కెట్లలో పాక్షికంగా అనుమతిస్తూ అగ్రరాజ్యం అమెరికాకు భారత్‌ ఆఫర్‌ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొలి పర్యటన సందర్భంగా ఈ ఆఫర్‌పై ఇరు దేశాలకు చెందిన అధికారులు  చర్చించనున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచంలో అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా భారత్‌ ఉంది. దీంతో విదేశాలకు దిగుమతి అయ్యే డెయిరి ఉత్పత్తులపై ఆంక్షలు విధించింది. భారత్‌లో దాదాపు 80 మిలియన్ల గ్రామీణ గృహాలకు డైరీ జీవనోపాధి కల్పిస్తోంది. అదేవిధంగా దేశీయంగా పౌల్ట్రీ పరిశ్రమ దెబ్బతినకుండా విదేశాల నుంచి పౌల్ట్రీ ఉత్పత్తులపై కూడా ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. భారత్‌ మార్కెట్లో ప్రవేశించేందుకు అనుమతులు ఇవ్వాలంటూ అమెరికా కోరుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మరోవైపు డొనాల్డ్‌ ట్రంప్‌ పర్యటనను అన్నీ విధాలుగా వినియోగించుకోవాని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తోంది. రెండు దేశాల మధ్య వ్యూహాత్మకంగా బంధాలను బలోపేతం చేసుకోవాని యోచిస్తోంది.