శ్రీలంక ఆర్మీచీఫ్ కు అమెరికా షాక్

శ్రీలంక ఆర్మీచీఫ్ కు అమెరికా షాక్

15-02-2020

శ్రీలంక ఆర్మీచీఫ్ కు అమెరికా షాక్

శ్రీలంక ఆర్మీ చీఫ్‌ షవేంద్ర సిల్వ ను అమెరికాలోకి అనుమతించబోమని ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో చెప్పారు. 2009 అంతర్యుద్ధంలో భారీగా మానవహక్కుల ఉల్లంఘనలకు అతడు పాల్పడినట్లు తమ వద్ద సృష్టమైన ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఆయా ఆధారాలను ఐక్యరాజ్య సమితి సహా పలు సంస్థలు కూడా గుర్తించాయని అన్నారు. షవేంద్రతో పాటు అతడి కుటుంబ సభ్యులు కూడా అమెరికాలో ప్రవేశించేందుకు అనర్హులని చెప్పారు. శాంతిని, మానవ హక్కులను పెంపొందించాంటూ శ్రీలంక ప్రభుత్వానికి అమెరికా సూచించింది.