డొనాల్డ్ ట్రంప్, మోదీ రోడ్ షో

డొనాల్డ్ ట్రంప్, మోదీ రోడ్ షో

15-02-2020

డొనాల్డ్ ట్రంప్, మోదీ రోడ్ షో

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీు కలిసి అహ్మదాబాద్‌లో చేయనున్న రోడ్‌షోకు పనులు చురుగ్గా సాగుతున్నాయి. దాదాపు 22 కిలోమీటర్ల పొడవున, 50 వేల మంది ప్రజలు దీనికి హాజరుకానున్నారని అహ్మదాబాద్‌ మేయర్‌ బిజాల్‌ పటేల్‌ చెప్పారు. ఈ రోడ్‌షో ద్వారా ట్రంప్‌-మోదీలు సబర్మతీ ఆశ్రమం చేరుకోనున్నారు. మహాత్మాగాంధీకి ఈ ప్రదేశంతో సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. అనంతరం ఇద్దరు కసి మొతెరాలో నిర్మించిన క్రికెట్‌ స్టేడియాన్ని చేరుకోనున్నారు. 22. కిలోమీటర్ల పొడవున ప్రజలు నిబడే పెద్ద రోడ్‌ షో ఇదే కావచ్చని బిజాల్‌ పటేల్‌ చెప్పారు. రోడ్‌షోకు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు తమ సంప్రదాయ ఆహార్యంలో కనిపిస్తారని చెప్పారు. మోదీ, ట్రంప్‌లు కలసి మెతెరాలో బహిరంగ సభలో పాల్గొంటారు.