సత్య నాదెళ్లకు మోదీ షాక్!

సత్య నాదెళ్లకు మోదీ షాక్!

14-02-2020

సత్య నాదెళ్లకు మోదీ షాక్!

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఈ నెలాఖరులో భారత్‌ వస్తున్నారు. విశ్వసనీయ వర్గా కథనం ప్రకారం.. ఆయన ఈ నె 24-26 మధ్య ఢిల్లీ, ముంబై, బెంగళూరుల్లో పర్యటిస్తారు. కొందరు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. ప్రధాని మోదీని కలిసేందుకూ నాదెళ్ల అపాయింట్‌మెంట్‌ కోరారు. కానీ ఇంతవరకూ పీఎంవో దీనిపై స్పందించలేదని తెలుస్తోంది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఇటీవల ప్రతికూల వ్యాఖ్యలు చేసిన సత్య నాదెళ్ల బీజేపీ ఆగ్రహానికి గురయ్యారు. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్‌ దానిపై వివరణ ఇచ్చింది. సత్య కూడా తన వ్యాఖ్యలను సవరించుకున్నారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వాణిజ్యం విషయంలో విదేశీ టెక్‌ సంస్థ పట్ల కేంద్ర కొంత కఠిన వైఖరి అవలంబిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.