వార్నర్‌ ఎస్టేట్‌ను సొంతం చేసుకున్న అమెజాన్‌ చీఫ్‌

వార్నర్‌ ఎస్టేట్‌ను సొంతం చేసుకున్న అమెజాన్‌ చీఫ్‌

14-02-2020

వార్నర్‌ ఎస్టేట్‌ను సొంతం చేసుకున్న అమెజాన్‌ చీఫ్‌

ప్రపంచ కుబేరుడు, ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ చారిత్రక వార్నర్‌ ఎస్టేట్‌ను సొంతం చేసుకున్నారు. దీని విలువ సుమారు 1,200 కోట్లు (165 మిలియన్‌ డాలర్లు). ఒకప్పుడు ఫ్రెంచ్‌ చక్రవర్తి నెపోలియన్‌కు చెందిన నదీ ప్రాంతం. ఇప్పుడు మీడియా మొగల్‌ డేవిడ్‌ గెఫెన్‌ నుంచి బెజోస్‌ కొనుగోలు చేసినట్లు ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ తెలిపింది. కాగా, ఈ డీల్‌ లాస్‌ ఏంజిల్స్‌ ప్రాంతంలో రికార్డు సృష్టించిందని, గతేడాది దాదాపు 150 మిలియన్‌ డాలర్లతో న్యూస్‌ కార్ప్‌ అధినేత రూపర్ట్‌ మర్దోచ్‌ కుమారుడు చ్లన్‌ మర్దోచ్‌ కొన్న బెల్‌-ఎయిర్‌ ఎస్టేట్‌ను మించిపోయిందని జర్నల్‌ వెల్లడించింది. బెవర్లీ హిల్స్‌లో గ వార్నర్‌ ఎస్టేట్‌ 9 ఎకరాలల్లో విస్తరించి ఉన్నది. జార్జియన్‌ శైలి ప్రహరీతో ఉన్న ఈ ఎస్టేట్‌లో అతిథి గృహాలు, ఓ టెన్నిస్‌ కోర్టు, మరో గోల్ప్‌ కోర్స్‌ ఉన్నాయి.

1930లో వార్నర్‌ బ్రదర్స్‌ మాజీ అధ్యక్షుడు స్వర్గీయ జాక్‌ వార్నర్‌ ఈ ఎస్టేట్‌ను నిర్మించారు. బెజోస్‌ సంపద మివ 110 బిలియన్‌ డార్ల పైమాటే (సుమారు రూ.8 లక్షలు కోట్లు). ది వాషింగ్టన్‌ పోస్ట్‌ న్యూస్‌పేపర్‌ యజమాని కూడా బెజోసేనన్న విషయం తెలిసిందే. గతేడాది భార్య మెకంజీతో విడిపోయిన బెజోస్‌.. ఆమెకు తన ఆస్తిలో పెద్ద మొత్తాన్నే భారణంగా చెల్లించిన సంగతి విదితమే.