tana food drive in Charlotte

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఛార్లెట్‌ విభాగం ఆధ్వర్యంలో అనార్తులకోసం ఫుడ్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 10,000మందికి అవసరమైన ఆహార పదార్ధాలను వారు సేకరించి అర్బన్‌ మినిస్ట్రీకి అందజేశారు. జనవరి 11వ తేదీన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు తానా నాయకులు, ఇతరులు పాల్గొన్నారు. తానా కమ్యూనిటీ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌ మల్లి వేమన మాట్లాడుతూ, దాతలు, ఇతరుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. మల్లి వేమనతోపాటు శ్రీనివాస్‌ చందు గొర్రిపాటి, నాగ పంచుమర్తి, పట్టాభి కంఠమనేని, సత్య వేమూరి, టాగోర్‌ మల్లినేని, రమణ అన్నె, సతీష్‌ పుల్లెల, పార్థ, రాము రెడ్డి కోడం, శివ, షణ్ముగ బత్తినేని తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు. ఫుడ్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఛార్లెట్‌ తానా టీమ్‌ను అధ్యక్షులు జే తాళ్ళూరి అభినందించారు.