Houston Protest Save Amaravati Save Amaravati Farmers

రాజధాని రైతులకు మద్దత్తుగా అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో తెలుగు ప్రవాసాంధ్రులు రాజధాని ప్రాంత రైతుల ఆందోళనకు అమెరికా లోని టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగర ప్రవాసాంధ్రులు సంఘీభావం ప్రకటించారు. హ్యూస్టన్ నగరంలో నిర్వహించిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లోని 13 జల్లాలకు చెందిన తెలుగు రైతు బిడ్డలు పాల్గొన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ పోరాటం చేస్తున్నవారికి మద్దత్తుగా నిలవాలని నిర్ణయించినారు, ఆర్ధికంగానూ అండగా ఉండాలని తీర్మానించారు. ప్రవాసాంధ్రులతో ఐకాస ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. సమావేశంలో పలువురు ప్రవాసాంధ్రులు రాజధాని రైతులకు మద్దత్తుగా ప్రసంగించారు. మీ రాజధాని ఏదని అడిగితే ఒకే పేరు చెబుతారు. కానీ ఏపీలో 3 పేర్లు చెప్పించే పరిస్తతి తీసుకొస్తున్నారని విమర్శింతారు బాధపడ్జారు.

అమరావతిని కాపాడుకోవటము చారిత్రక అవసరమన్నారు. పలువురు ప్రతినిధులు ప్రసంగిస్దూ హైకోర్టూ అస్సెంబ్లీ సచివాలయం వివిధ శాఖల భవనాలు అమరావతి ప్రాంతంలోనే ఉన్నాయి. ఇప్పటికే 9 వేల కోట్లు ఖర్చు చేశారు, మరో 3 వేల కోట్లు ఖర్చు చేస్తే మిగతావి పూర్తవుదాయి. ప్లాట్లు రైతులకు ఇవ్వగా ఇంకా 10 వేల ఎకరాల భూమి ఉంటుంది దానిని అమ్మగా వచ్చిన డబ్బుతో అభివృద్ధి పనులు చేయవచ్చు అని అభిప్రాయపడ్డారు. మూడు రాజధానుల ప్రతిపాదన పనికిరాని ప్రతిపాదన, ముఖ్యమంత్రి ఒకచోట మంత్రులు మరోచోట సచివాలయం ఇంకో దగ్గర ఉంటే పారిశ్రామిక వేత్తలు అనుమతులు పొందేందుకు 3 చోట్లా తిరగాలా ? ప్రాంతాల మధ్య విధ్వేషాలు సృుష్టించడమ్ మంచిది కాదు. రాజధాని విషయం ఒక వ్యక్తికో లేక ఒక ప్రాంతానికో సంభందించిన సమశ్య కాదు 13 జిల్లాలకు చెందిన ఆంధ్రుల సమశ్య దీని గురించి యువత ఆలోచించాలి అని సూచించారు. రాజధాని వివాదంపై కేంద్రం జోఖ్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.