Indian American Entrepreneur Announces Bid For California Town Mayor

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్‌ రామోన్‌ నగర మేయర్‌ పదవికి పోటీ చేయనున్నట్టు భారతీయ అమెరికన్‌ మహిళ అపర్ణ మాదిరెడ్డి ప్రకటించారు. నవంబరులో ఈ ఎన్నికలు జరగనుండగా, పోటీ చేస్తానంటూ మొట్టమొదట ప్రకటించిన నాయకురాలు ఈమే కావడం గమనార్హం. అర్వసాఫ్ట్‌ అనే సాఫ్ట్‌వేర్‌ సలహా సంస్థ యజమానురాలైన ఆమె.. భర్త, కుమార్తెతో కలిసి ఆ నగరంలో ఉంటున్నారు. ప్రస్తుతం కాంట్రాకోస్ట్రా కంట్రీ జనాభా లెక్కల కమిటీలో డిస్ట్రిక్ట్‌-2 ప్రతినిధిగా ఉంటున్నారు. నగరంలోని బహిరంగ స్థలాల సలహా సంఘం అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. భూగర్భ శాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీ చేసిన ఆమె భూ వినియోగ ప్రణాళిక రూపకల్పనలో నిపుణురాలు కావడం విశేషం.