nirmala-sitharaman-among-world-s-100-most-powerful-women-forbes

ఫోర్బ్స్‌ అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో భారత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు చోటు లభించింది. 2019 సంవత్సరానికి గాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 మంది అత్యంత శక్తిమంతమైన మహిళలతో కూడిన జాబితాను ఫోర్బ్స్‌ ప్రకటించింది. ఇందులో నిర్మలా సీతారామ్‌కు 34వ స్థానం లభించింది. 60 ఏళ్ల వయసున్న నిర్మలా ఈ జాబితాలో మొదటిసారిగా స్థానం దక్కించుకున్నారు. అంతేగాకుండా ఈ జాబితాలో స్థానం పొందిన తొలి భారత మహిళా ఆర్థిక మంత్రిగా కూడా నిర్మలా సీతారామన్‌ నిలిచారు. ఈమె ఇంతకు ముందు రక్షణ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. అంతకుముందు మాజీ ప్రధాని ఇందిరీగాంధీ కూడా కొంత కాలం ఈ బాధ్యతలు నిర్వర్తించారు. కాగా తొలి పూర్తి స్థాయి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామ్‌ కొనసాగుతున్నారు.

ఈ జాబితాలో జర్మన్‌ చాన్స్‌లర్‌ ఏంజెల్‌ మెర్కెల్‌ (65 ఏళ్లు) వరుసగా తొమ్మిదో ఏడాది కూడా అగ్రస్థానంలో నిలువడం విశేషం. రెండో స్థానంలో యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ క్రిస్టినా లగార్డే నిలిచారు. మూడో స్థానానిన యూఎస్‌ ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ దక్కించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూతురు, ఆయన సలహాదారు ఇంవాకా 42వ స్థానంలో నిలిచారు. టెన్నీస్‌ స్టార్‌ సెరీనా విలియమ్స్‌ 81వ స్థానంలో ఉన్నారు.