Veteran Telugu actor and writer Gollapudi Maruti Rao passes away

"రేడియో, సాహిత్య, నాటక, సినిమా రంగాలలో రచయితగా, నటుడిగా అనేక పురస్కారాలు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి డా. గొల్లపూడి మారుతీ రావు గారితో ఎన్నో ఏళ్ల అనుబంధం, స్నేహం, మరువలేనిది. డాలస్ నగరంలో స్థానిక తెలుగు సంస్థ చేపట్టిన నెల నెల తెలుగు వెన్నెల కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేసిన సాహితీవేత్తను కోల్పోవడం బాధాకరం. తరుచూ ఫోన్ సంభాషణ ద్వారా ఎంతో ఆప్యాయంగా పలు విషయాల పై తరుచూ చర్చించేవాళ్ళం. సామాజిక స్పృహకలిగిన ఒక మంచి రచయితను మేధావిని మిత్రుని కోల్పోవడం దురదృష్టకరం. 2013 లో డాలస్ లో జరిగిన తానా 19వ మహాసభల్లో ఆయనను సత్కరించుకొనే అవకాశం కలిగింది.  2017 డిసెంబర్ 16 న అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తరపున ఏలూరులో జరిగిన సభలో ఆయనకు సినీరత్న పురస్కారం అందజేసి గౌరవించుకున్నాం. డా. గొల్లపూడి మరణం తెలుగు వారందరికి ఒక తీరని లోటు. డా. గొల్లపూడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాము. "

 
 
-- డా. ప్రసాద్ తోటకూర 
తానా మాజీ అధ్యక్షులు, డాలస్, అమెరికా 
మరియు వ్యవస్థాపక అధ్యక్షులు, అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా