H 1B visa New registration system will start in March

హెచ్‌-1బీ వీసాల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్‌ ఏజెన్సీ వెల్లడించింది. హెచ్‌-1బీ వీసా కోసం ఎలక్ట్రానిక్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను అమెరికా పూర్తి చేసింది. అమెరికాలో ఉన్న కంపెనీలు ఉద్యోగుల కోసం హెచ్‌-1బీ వీసాలు జారీ చేస్తాయి. అయితే ఆ వీసాలు పొందేందుకు ఎక్కువగా భారత్‌, చైనా దేశస్థులు దరఖాస్తు చేసుకుంటుంటారు. 2021 సంవత్సరానికి విదేశీయులకు వీసా ఇవ్వాలనుకుంటున్న కంపెనీలు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ శాఖ కోరింది. దీని కోసం పది డాలర్ల ప్రాసెసింగ్‌ ఫీజు వసూల్‌ చేయనున్నారు.