US threatens tax on champagne and French cheese

ఫ్రాన్స్‌ విధించిన గఫా పన్నులపై అమెరికా అద్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చిటపటలాడారు. ఫ్రాన్స్‌ అమెరికా డిజిటల్‌ కంపెనీలపై ఈ గఫా పన్ను విధించింది. అమెరికన్‌ కంపెనీలు తమ దేశాల్లో నిర్వహించిన ఆర్థిక కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మాతృ భూభాగానికి తరలివస్తున్నాయని పలు యూరోపియన్‌ దేశాలు విమర్శిస్తున్నాయి. గూగుల్‌, ఆపిల్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌ వంటి డిజిటల్‌ సంస్థలపై ఫ్రాన్స్‌ ఈ పన్ను విధించింది.