prameela jaipal comments on trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ట్రంప్‌కు అధ్యక్షుడికి అండగా నిలబడటం తప్పుడు సంకేతాలు పంపిస్తోందని ఇది అమెరికా భవిష్యత్‌కు మంచిదికాదని ఇండో అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యురాలు ప్రమీలా జయపాల్‌ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై అభిశంసన ప్రక్రియకు ఆమె గట్టిమద్దతుదారుగా నిలిచారు. అధికార దుర్వినియోగానికి పాల్పడే అధ్యక్షుడిని ఇలాగే వదిలేస్తే రానున్న అధ్యక్షులు కూడా తన సొంత రాజకీయ ప్రయోజనాలను అమెరికన్‌ ప్రజలపై రుద్దతారని జాతీయ భద్రత, ఎన్నికలు, మన ప్రజాస్వామ్యానికే ముప్పుగా పరిణమిస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో పదవీచ్యుతిపై జరుగుతున్న విచారణలో జ్యూడిషియరీ కమిటీ ఎదుట ట్రంప్‌ అభిశంసనపై విచారణ తొలి రోజున ప్రమీలా జయపాల్‌ ట్రంప్‌ అభిశంసనకు మద్దతుగా మాట్లాడారు జ్యూడీషియరీ కమిటీలో ఆమె ఒక్కరే ఇండియన్‌ అమెరికన్‌ సభ్యురాలు కావడం విశేషం.