3 legal experts forcefully testified on Wednesday that Trump abused his power and should be impeached

అభిశంసన విచారణ ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రతినిధుల సభకు చెందిన కీలక కమిటీ నివేదిక తెలిపింది. అభిశంసన విచారణ ఆధారంగా ఈ నివేదికను హౌస్‌ ఇంటెలిజెన్స్‌ కమిటీ, పర్యవేక్షణ, సంస్కరణ కమిటీ, విదేశీ వ్యవహారాల కమిటీల సభ్యులు రూపొందించారు. ఈ నివేదికను శాశ్వత ఎంపిక కమిటీ విడుదల చేసింది. తన రాజకీయ ప్రత్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జోబిడెన్‌పై దర్యాప్తు కోసం ఉక్రెయిన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్‌ తన కార్యాలయ అధికారాన్ని ఉపయోగించారని నివేదిక పేర్కొంది. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేందుకు విదేశీ సహాయం పొందాలనే పథకం బయటపడిన తర్వాత ట్రంప్‌ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అనేక ఆటంకాలకు పాల్పడినట్టు ఆధారాలు సృష్టంగా ఉన్నాయని కమిటీ సభ్యులు వెల్లడించారు.