రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు దుర్మరణం

02-12-2019

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు దుర్మరణం

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఒకరిని విజయవాడకు చెందిన వైభవ్‌ గోపిశెట్టి(26) గుర్తించారు. టెనస్సీ స్టేట్స్‌ యూనివర్సిటీలో వైభవ్‌ పీహెచ్‌డీ చేస్తున్నారు. అక్కడే ఎమ్మెస్‌ చేస్తున్న జూడీ స్టాన్లీ పినీరియో(23)తో కలిసి గురువారం రాత్రి ఓ పార్టీకి వెళ్లారు. తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ వాహనం అక్కడే వదిలి పరారైనట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా, తమ వర్సిటీకి చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతిచెందడం పట్ల టీఎస్‌యూ తీవ్ర సంతాపం ప్రకటించింది.