ఫోర్బ్స్‌ జాబితాలో రిలయన్స్‌ అధినేత

30-11-2019

ఫోర్బ్స్‌ జాబితాలో రిలయన్స్‌ అధినేత

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబాని మరోసారి సత్తా చాటారు. ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ప్రకటించిన కుబేరుల్లో ముకేష్‌ అంబానీ టాప్‌ 10లో నిలిచి రికార్డ్‌ సృష్టించారు. ముకేష్‌ సంపద 60 బిలియన్‌ డాలర్లుగా ( రూ.4.3 లక్షల కోట్లు) పేర్కొన్న ఫోర్బ్స్‌ ప్రపంచ కుబేరుల్లో ఆయన 9 స్థానంలో ఉన్నట్లు సృష్టం చేసింది. ప్రపంచంలోని అత్యంత శ్రీమంతుల సంపదలో రోజువారీగా వస్తున్న మార్పుల ప్రకారం రియల్‌ టైం జాబితాలో ర్యాంకులు మారుతుంటాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ఇటీవల బాగా పెరగడంతో రోజు వారీ అత్యంత శ్రీమంతుల జాబితాలో తొలి 10 మందిలో ముకేష్‌కు స్థానం లభించింది.