బాక్సర్‌ రాకీ లుక్‌లో అమెరికా అధ్యక్షుడు!

28-11-2019

బాక్సర్‌ రాకీ లుక్‌లో అమెరికా అధ్యక్షుడు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా రాకీ బల్బోవా స్టయిల్‌లో ఫోజు ఇస్తూ తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. బాక్సర్‌ రాకీ సినిమా పోస్టర్‌ను క్రాప్‌ చేసి ట్విట్టర్‌లో ట్రంప్‌ వాడిన తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నది. రాకీ మూవీ ఫోటో నుంచి హీరో తల స్థానంలో ట్రంప్‌ తన తలను ఫిక్స్‌ చేసిన ఓ ఫోటోను పోస్టు చేశారు. ఇప్పుడా ఫోటో ఇంటర్నెట్‌లో సెన్షేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. అధ్యక్షుడు ట్రంప్‌ ఆ ఫోటోకు ఎటువంటి క్యాప్షన్‌ కూడా ఇవ్వలేదు. దీంతో రూమర్లు చెక్కర్లు కొడుతున్నాయి. కొందరు ఫన్నీ కామెంట్స్‌ కూడా చేస్తున్నారు. ట్రంప్‌కు గుండెపోటు వచ్చిందన్న వార్తలు రావడం వల్లే ఆయన ఇలా చేసి ఉంటారని కూడా కొన్ని కథనాలు వెలుబడుతున్నాయి.