న్యూజెర్సిలో తానా సిపిఆర్‌ వర్క్‌షాప్‌ సక్సెస్‌

28-11-2019

న్యూజెర్సిలో తానా సిపిఆర్‌ వర్క్‌షాప్‌ సక్సెస్‌

న్యూజెర్సిలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో సిపిఆర్‌, ఎఇడిపై వర్క్‌షాప్‌ నిర్వహించారు. నవంబర్‌ 24వ తేదీన ఎడిసన్‌లో జరిగిన ఈ వర్క్‌షాప్‌కు దాదాపు 50 మంది హాజరై అత్యవసర సమయాల్లో అందించాల్సిన చికిత్సకు సంబంధించిన మెళకువలను తెలుసుకున్నారు. గుండెనొప్పి వచ్చినప్పుడు అత్యవసరంగా అందించాల్సిన చికిత్స పద్ధతులపై నిర్వాహకులు శిక్షణ ఇచ్చారు. ఎఇడి డివైజ్‌ను ఎలా ఉపయోగించాలో కూడా నేర్పించారు. హార్ట్‌ అటాక్‌, స్ట్రోక్‌ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై న్యూజెర్సి తానా టీమ్‌ ఇందులో వీడియో ప్రజంటేషన్‌ కూడా ఇచ్చింది. ఇలాంటి మంచి కార్యక్రమాలను నిర్వహించినందుకు తానా టీమ్‌ను అందరూ అభినందించారు. తానా అధ్యక్షుడు జే తాళ్ళూరి, తానా కమ్యూనిటీ కో ఆర్డినేటర్‌ మల్లి వేమన, తానా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ అంజయ్య చౌదరి లావు, రాజేష్‌ అడుసుమిల్లి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తానా న్యూజెర్సిటీమ్‌ నాయకులు తెలిపారు. వంశీ వాసిరెడ్డి, శ్రీ చౌదరి కోనంకి, రేఖ ఉప్పులూరి, శ్రీనివాస్‌ ఓరుగంటి, సాయి పాలేటి, తానా న్యూజెర్సి టీమ్‌ వలంటీర్లు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు.

Click here Event Gallery