విస్తరణలో స్టీల్‌కేస్‌

28-11-2019

విస్తరణలో స్టీల్‌కేస్‌

అమెరికాకు చెందిన ఫర్నిచర్‌, టెక్నాలజీ ఉత్పత్తుల సంస్థ స్టీల్‌కేస్‌ వ్యాపారాన్ని విస్తరిస్తున్నది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆరు షోరూంలను ఏర్పాటు చేసిన సంస్థ.. వచ్చే ఏడాది చివరినాటికి ఈ సంఖ్యను 15కి పెంచుకోనున్నట్లు స్టీల్‌కేస్‌ ఆసియా పసిఫిక్‌ ప్రెసిడెంట్‌ ఉలిగ్విన్నర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో తన నూతన ఉత్పత్తులను ప్రదర్శించడానికి ప్రత్యేకంగా పాప్‌-ఆఫ్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నూతన శ్రేణి ఫర్నిచర్‌ ఉత్పత్తులకు డిమాండ్‌ ఉన్నదని, ముఖ్యంగా కార్యాలయాలను అత్యంత ఆధునీక పరికరాలతో డిజైనింగ్‌ చేయడం ఈ మధ్యకాలంలో భారీగా పెరిగిందన్నారు.