70 percent of Americans say Trump s actions tied to Ukraine were wrong

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిశంసన తీర్మానంపై బహిరంగ విచారణ సందర్భంగా ఏబీసీ న్యూస్‌- ఇప్సోసో ఓ సర్వే నిర్వహించింది. ట్రంప్‌ అధ్యక్ష పదవి నుంచి తప్పుకునే అవకాశం ఉందని అమెరికాలోని ఎక్కువ మంది ప్రజలు భావిస్తున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న వారిలో 51 శాతం మంది ప్రజలు అమెరికా సెనెట్‌లో ట్రంప్‌ దోషిగా తేలాలని కోరుకుంటున్నట్టు సృష్టమైంది. అభిశంసనకు సానుకూలంగా ఉన్నవారిలో 6 శాతం మంది ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించడానికి విముఖత చూపిస్తున్నట్టు తెలిసింది. అభిశంసన తీర్మాణంపై విచారణ ప్రారంభానికి ముందు కంటే ఈ సంఖ్య పెరగడం గమనార్హం. అంతకు ముందు ఫైవ్‌ థర్టీఎయిట్‌ వెబ్‌సైట్‌ నిర్వహించిన సర్వేలో ట్రంప్‌కు వ్యతిరేకంగా 48శాతం మంది తమ అభిప్రాయాలు వెల్లడించారు.