India US dollar 7 5 billion defence deals for armed drones

అమెరికాతో రూ.53 వేల కోట్ల (7.5 బిలియన్‌ డాలర్లు) భారీ రక్షణ ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. ఈ దఫా కొనుగోలు చేయనున్న ఆయుధ సామగ్రిలో సముద్ర గస్తీ డ్రోన్లు, నావికాదళ గూఢచార విమానాలు, జలాంతర్గాముల విధ్వంసక విమానాలు ఉన్నట్లు సమాచారం. తొలుత వీటి కొనుగోలుకు నౌక దళం మాత్రమే ఆసక్తిచూపగా, పెరుగుతున్న భద్రతా అవసరాల రీత్యా ఇటీవల త్రివిధ దళాలూ అందుకు సమ్మతించినట్టు రక్షణశాఖ వర్గాలు చెబుతున్నారు. సముద్ర గస్తీ డ్రోన్లు, నావికా దళ గూఢచార విమానా ఒప్పందం విలువ రూ.32 వేల కోట్ల(4.5 బిలయన్‌ డాలర్లు) మేర ఉండొచ్చని అంచనా.