Kuchipudi Dance in America

అమెరికా, కెనడా, యూరోప్, ఆస్ట్రేలియా ఇలా ఏ దేశమేగినామన భారతీయ సంస్కృతిని మన సంప్రదాయాల్ని మరువక పోవడమే కాదు వారి పిల్లలకి సుశిక్షణనిచ్చి ముందు తరాలకి భారతీయతను అందచేయడం ఎంతైనా ముదావహం. కూచిపూడి, భరతనాట్యం, కథక్ వంటి సాంప్రదాయ నృత్యాలు కర్ణాటక, హిందుస్తానీ వంటి సాంప్రదాయ సంగీతాలు నేర్పే సంగీత, నృత్య కళాకేంద్రాలు అట్లాంటా, న్యూజెర్సీ, చికాగో, సెయింట్ లూయిస్, శాన్ ఫ్రాన్సిస్కో లాంటి నగరాల్లో కోకొల్లలు. తానా, నాట్స్, నాటా, ఆటా వంటి జాతీయసంస్థలు సుప్రసిద్ధ కళాకారులతో పాటు వర్ధమాన కళాకారులకి వారి వారి ప్రతిభాపాటవాల్ని ప్రదర్శించడానికి వేదికలు కల్పిస్తాయి. సహస్ర ససిపల్లి, శాన్వి కుంటమల్ల, నిధి నిహారిక చెన్నంపట్టు మని పది సంవత్సరాల వయస్సువారు కానప్పటికీ కూచిపూడి నృత్యంలో ఇప్పటికే చక్కని అభినవేశం చూపుతున్న చిన్నారులు. చికాగాలో నాట్స్, సెయింట్ లూయిస్  పట్టణంలో తానా నిర్వించిన తెలుగుసంబరాల్లో ఈ చిన్నారులు నృత్యప్రదర్శనలిచ్చారు.

శ్రీగౌరీ శంకర్ మరియు శ్రీమతి జాహ్నవిల కుమార్తె సహస్ర ససిపల్లి, శ్రీ ప్రవీణ్ కుంటమల్ల మరియు శ్రీమతి సుష్మితల కుమార్తె శాన్వి కుంటమల్ల అలాగే శ్రీ రాజశేఖర్  మరియు శ్రీమతి ఇందిరా ప్రియదర్శనిల కుమార్తె నిధి నిహారిక చెన్నం. 1982 లో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి పట్టణంలో ప్రారంభమై ఇప్పుడు టేనస్సీ రాష్ట్రం లోని మెంఫిస్  మహా పట్టణంలో కొనసాగుతున్న సాంప్రదాయ సంగీత, నృత్య శిక్షణాలయం "ఇండియన్ బాలే థియేటర్" లో ఈ చిన్నారు  ప్రముఖ కూచిపూడి నృత్య గురువులైన శ్రీమతి చంద్ర ప్రభ మరియు డాక్టర్రమణ వాసిలి వద్ద గత మూడు సంవత్సరాలుగా కూచిపూడి నృత్యాన్ని అభ్యసిస్తున్నారు. 

ఈ చిన్నారులు ఇప్పటి వరకు దాదాపు 30 పైగా నృత్య  ప్రదర్శనల్లో  పాల్గొన్నారు.  ఇండియా కల్చరల్ సెంటర్  అండ్  టెంపుల్  (శ్రీవెంకటేశ్వర ఆలయం), ఇండియా అసోసియేషన్ అఫ్ మెంఫిస్, దిఆర్క్, బ్రిడ్జిబిల్డర్లు, తెలుగు అసోసియేషన్  అఫ్ మెంఫిస్ వారు నిర్వహించిన అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శనలిచ్చారు. శ్రీ వెంకటేశ్వర ఆలయ ద్వితీయ కుంభాభిషేకం, వినాయక నిమజ్జనం, సంక్రాంతి సంబరాలు, ఉగాది వేడుకలు, ఇండియా ఫెస్ట్ ఇలా పలు సందర్భాల్లో ప్రదర్శనలిస్తూనే ఉంటారు. 

కూచిపూడి నృత్య సంప్రదాయ ప్రసిద్ధమైన పూర్వ రంగం, జతిస్వరం, రామాయణ శబ్దం, తిల్లాన, బృందావన నిలయే, కొలువైతివా రంగసాయి, శివుడు తాండవమాడే, ఆనంద తందమాడే శివుడు, అలాగే శ్రీ రామదాసు కీర్తనలు ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, పలుకే బంగారమాయె, అన్నమాచార్య కీర్తనలు అదివో అల్లదివో శ్రీ హరి వాసము, కులుకక నడువరో కొమ్మలారా, ముద్దుగారే  యశోద, పిడికిటి తలంబ్రాలు, తిరువీధుల దేవదేవుడు మొదలైనవే కాకుండా శ్రీ రామ  ఓరామ, అఖిలాండేశ్వరి, అర్థనారీశ్వర వంటి భక్తిపాటల్ని ప్రదర్శించారు, నారాయతీర్థుల తరంగం, దశావతార శబ్దం, భామాకలాపం, పలుకుతేనెల తల్లి పవళించెను, భావములోన బాహ్యమునందును, మరకత మణిమయ వంటి మరిన్ని అంశాలు నేర్చుకొని అమెరికాలోని ఇతర నగరాల్లోనే కాకుండా తిరుపతి, శ్రీ కాళహస్తి, అన్నమయ్య పుట్టిన తాళ్ళపాక, కూచిపూడి నాట్యం పుట్టిని కూచిపూడి గ్రామంలో, హైదరాబాద్ రవీంద్ర భారతిలో అలాగే విశాఖపట్నం, విజయవాడ లాంటి ప్రముఖ పట్టణాల్లో ప్రదర్శించాలన్నది ఈ చిన్నారుల కోరిక. అమ్మమ్మలు, నాయనమ్మలు, పిన్నమ్మలు, పెద్దమ్మలు, బాబయ్యలు, పెద్దనాన్నలు ఆలా అయినా వారందరి ముందు ప్రదర్శించాలని ఎవరికుండదు? ఈ చిన్నారుల కోరిక నెరవేరాలని కోరుకుందాం. తెలుగురాష్ట్రాల్లో వుండే ఏ సాంస్కృతిక సంస్థలో ఈ చిన్నారుల కోరిక తీరుస్తాయనుకొందాం. 

For more details about dance lessons and performances contact:

Dr. Ramana Vasili
Spiritual Foundation, Inc.
7062 S. Beringer Drive
Cordova, Tennessee 38018
901-387-9646
ramanavvasili@hotmail.com