సీసీఎంబీ శాస్త్రవేత్తకు ఇన్ఫోసిస్‌ అవార్డు

08-11-2019

సీసీఎంబీ శాస్త్రవేత్తకు ఇన్ఫోసిస్‌ అవార్డు

ఇన్ఫోసిస్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ ఇద్దరు మహిళల సహా ఆరుగురికి పురస్కారాలను ప్రకటించింది. ఇందులో హైదరాబాద్‌ సీసీఎంబీకి చెందిన చీఫ్‌ సైంటిస్ట్‌ మంజులా రెడ్డి ఉన్నారు. జీవశాస్త్రంలో ఆమె చేసిన పరిశోధనలకు ఈ గుర్తింపు లభించింది. ఇంజినీరింగ్‌ అండ్‌ కంప్యూటర్స్‌లో సునిత సరవాగి (ముంబయి), హ్యుమానిటీస్‌లో వి.దేవదేవన్‌, గణితంలో సిద్థార్థ, భౌతికశాస్త్రంలో జి.ముగేశ్‌ (బెంగళూరు), సామాజిక శాస్త్రంలో ఆనంద్‌ పాండియన్‌ (తమిళనాడు)లకు పురస్కారాలు దక్కాయి. ఇన్ఫోసిస్‌ విజ్ఞాన ప్రతిష్టాన (ఐఎస్‌ఎఫ్‌) ఆధ్యర్యంలో బెంగళూరులో నిర్వహించిన 11వ ఇన్ఫోసిస్‌ ప్రైజ్‌ -2019 కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఈ పురస్కారాలను ప్రకటించారు.