చైనా అధ్యక్షుడికి ట్రంప్‌ ఆహ్వానం

06-11-2019

చైనా అధ్యక్షుడికి ట్రంప్‌ ఆహ్వానం

రెండు దేశాలమధ్య ట్రేడ్‌వార్‌ ఉధృతంగా కొనసాగుతున్న తరుణంలో అమెరికా, చైనా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా చైనా అధ్యక్షుడిని ఆహ్వానించారు. శ్వేతసౌధం ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ వాణిజ్య చర్చల్లో భాగంగా మొదటిదశ ఫలవంతం అయినందున ఒప్పందం సంతకాలు చేసేందుకు జిన్‌పింగ్‌కు ట్రంప్‌ ఆహ్వానం పలికారని చెబుతున్నారు. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆగ్నేయాసియా దేశాల సదస్సులో అమెరికా వాణిజ్యచర్యల బృందంలోని సభ్యుడు బర్ట్‌ ఒబ్రెయన్‌ మాట్లాడుతూ చైనాతో అమరికా భారీ వాణిజ్య ఒప్పందాలను కోరుతోందని, మొదటి దశ ఒప్పందంపై సంతకం పెట్టేందుకు ప్రెసిడెంట్‌ ట్రంప్‌ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ఆహ్వానించారని వెల్లడించారు.