డొనాల్డ్‌ ట్రంప్‌పై పెరుగుతున్న వ్యతిరేకత

06-11-2019

డొనాల్డ్‌ ట్రంప్‌పై పెరుగుతున్న వ్యతిరేకత

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకుంటున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. పలు నిర్ణయాలపై న్యాయస్థానాలు ఆయనకు చురకలంటించాయి. రోజురోజు ఆయన గ్రాప్‌ డౌన్‌ అవుతోందని పలు సర్వేలు తేల్చి చెబుతున్నాయి. వచ్చే ఏడాది జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరపున బరిలో నిలిచిన గెలుస్తామని ట్రంప్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆయన గతేడాది ఏ రాష్ట్రాల్లో సంపూర్ణ మెజారిటీ సాధించారో అవే రాష్ట్రాల్లో ట్రంప్‌ను చిత్తుచిత్తుగా ఓడించేందుకు డెమోక్రటిక్‌ పార్టీ నేతలు ఎత్తుగడలు వేస్తునారు. రానున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ఓటమిపాలవడం ఖాయమని చెబుతున్నారు.