AIA Dussera Diwali Dhamaka Grand Success

ఆకట్టుకున్న ఆట-పాట...లక్ష్మీపూజ...రావణ్‌ దహన్‌

అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండో అమెరికన్స్‌ (ఎఐఎ), బాలీ 92.3 ఆధ్వర్యంలో దసరా, దీపావళి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. విశాలమైన మైదానంలో జరిగిన ఈ వేడుకల్లో పలు భారతీయ సంఘాలు పాలుపంచుకున్నాయి. బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ (బాటా)తో సహా దాదాపు 35 సంఘాలు వేడుకల్లో పాల్గొన్నాయి. భారతీయుల పెద్ద పండుగ అయిన దసరా, దీపావళి వేడుకల్లో 25,000 మంది పాల్గొని ఉత్సాహంగా, వేడుకలను చేసుకున్నారు.

ఈ వేడుకకు సంజీవ్‌ గుప్తా సిసిఎ (ఫైర్‌వర్స్‌ స్పాన్సర్‌), గ్రాండ్‌ స్పాన్సర్‌గా డా. ప్రకాష్‌ అద్వానీ ఫ్యామిలీ డెంటిస్ట్రీ (రావణ్‌ దహన్‌ స్పాన్సర్‌), ప్లాటినమ్‌ స్పాన్సర్స్‌ OnshoreKare.com insurance (రథయాత్ర స్పాన్సర్‌), సంపూర్ణ వాస్తుకు చెందిన నీరాజీ (మహా మంగళహారతి స్పాన్సర్‌), ఈవెంట్స్‌ ట్రావెల్‌ పార్టనర్‌గా TraveloPod, ఆజాద్‌ ఆరమండ్ల (ఫైనాన్షియల్‌ అడ్వయిజర్‌), శ్రీని గోలి (రియల్టర్‌-కెల్లర్‌ విలియమ్స్‌), ఐసీఐసీఐ బ్యాంక్‌ ఇతర స్పాన్సర్లుగా వ్యవహరించాయి.

దీపావళి, దసరా వేడుకలు ఉదయం నుంచి రాత్రిదాకా వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దివ్వెల తయారీ, రంగోళి, ఫ్లాష్‌మోబ్‌, డిజె జంక్షన్‌, రావణ్‌ దహన్‌ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. దాంతోపాటు పెద్దఎత్తున బాణాసంచాను కాల్చారు. మరోవైపు ప్రధానస్టేజీపై ఏర్పాటు చేసిన బాలీవుడ్‌ డ్యాన్స్‌లు అలరించాయి. బాటా కరవొకె టీమ్‌ పాడిన పాటలు అందరినీ మైమరపింపజేశాయి.

ఇండియన్‌ కాన్సల్‌ జనరల్‌, అంబాసిడర్‌ సంజయ్‌ పాండా, అసెంబ్లీ మెంబర్‌ యాష్‌ కల్రా, శాంతాక్లారా కౌంటీ షెరీప్‌ లారీ స్మిత్‌, శాంతాక్లారా కౌంటీ సూపర్‌వైజర్‌ దేవ్‌ కర్టెసీ, ఫ్రీమాంట్‌ వైస్‌ మేయర్‌ రాజ్‌ సల్వాన్‌, యుఎస్‌ కాంగ్రెస్‌మెన్‌ ఆర్‌ఓ ఖన్నా కార్యాలయం డిస్ట్రిక్ట్‌ ఆఫీసర్‌ స్వపంతి మండాలిక, అసెంబ్లీ మెంబర్‌ కాన్సెన్‌ చు ప్రతినిధి అనురాగ్‌ పాల్‌ ఇలా ఎంతోమంది ప్రముఖులు, ప్రతినిధులు ఈ వేడుకలకు హాజరై అందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. పెద్దఎత్తున వేడుకలను నిర్వహించిన ఎఐఎ, బాటాను అభినందించారు.

ఈ వేడుకల్లో భాగంగా ఎఐఎ తరపున పలువురికి ప్రశంసా పత్రాలను, అందించారు. స్పెల్లింగ్‌ బి ఛాంపియన్‌ రిషిక్‌ గంథశ్రీ, అనుగ్రహ పిళ్లై (యుఎస్‌ ఫిగర్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌), విన్సెంట్‌ వర్కీ (దేశభక్తి ఛాయాచిత్రాల ప్రదర్శన)కి ఇచ్చారు.

రథంపై కూర్చున్న లక్ష్మీ అమ్మవారిని పలువురు దర్శించుకుని రథయాత్రలో భక్తిపారవశ్యంతో ఎంతోమంది పాల్గొన్నారు. పలువురు అమ్మవారిని స్తుతించారు. దేవాలయంలో ఉన్నట్లుగానే ఏర్పాటు చేసిన సెట్టింగ్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి. అమ్మవారికి పూజారి హారతి ఇచ్చిన తరువాత భక్తులందరికీ లడ్డుప్రసాదాలను పంచిపెట్టారు. న్యూఇండియా బజార్‌ వారు దీనిని స్పాన్సర్‌ చేశారు. దేశీ ఫుడ్‌ ఫెస్టివల్‌లో వివిధ రకాల రుచులను ఏర్పాటు చేశారు. ఛాట్‌ భవన్‌, మంత్ర, బాంబే టు గోవా, మ్యాంగోస్‌ ఇండియన్‌ కుజిన్‌, మామోస్‌ కిచెన్‌, అర్బన్‌ స్పైస్‌, రెడ్‌ చిల్లీస్‌, శ్రీస్‌ కిచెన్‌, చిట్టిగారె, పీకాక్‌ డబ్లిన్‌, కాలిఫోర్నియా ఐస్‌క్రీమ్‌ వంటి సంస్థలు ఫుడ్‌ స్పాన్సర్లుగా వ్యవహరించాయి. దాదాపు 60మందికిపైగా వెండర్లు తమ వ్యాపార సముదాయాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. దుస్తులు, ఆభరణాలు, మెహందీ, రియల్‌ ఎస్టేట్‌, ఆఫ్టర్‌ స్కూల్స్‌, ఐటీ ట్రైనింగ్‌, హెల్త్‌ సర్వీసెస్‌ వంటి సంస్థలు తమ బూత్‌లను ఇక్కడ ఏర్పాటు చేశాయి. పలువురు షాపింగ్‌ కూడా చేశారు. సాయంత్రం 6.30 గంటలకు ఫ్యాషన్‌ షో, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకలను విజయవంతం చేసినవారందరికీ ఎఐఎ టీమ్‌ ధన్యవాదాలు తెలియజేసింది.

Click here for Event Gallery