మిస్‌ సూపర్‌ గ్లోబ్‌ వరల్డ్‌గా అక్షర

22-10-2019

మిస్‌ సూపర్‌ గ్లోబ్‌ వరల్డ్‌గా అక్షర

దుబాయ్‌లో జరిగిన మిస్‌ సూపర్‌ గ్లోబ్‌ వరల్డ్‌-2019 పోటీల్లో తెలుగమ్మాయి అక్షరరెడ్డి విజేతగా నిలిచింది. 22 దేశాల నుంచి పోటీ పడిన అందగత్తెలను వెనక్కు నెట్టి.. ఈ కిరిటాన్ని సొంతం చేసుకుంది. ప్రేక్షకులు చేసిన ఇండియా.. ఇండియా నినాదాలతో ఉద్వేగానికి గురైనట్లు ఆమె చెప్పారు. ప్రస్తుతం ఒక తెలుగు సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు.