యూఎస్‌ కాన్సులేట్‌ సేఫ్‌ విలేజ్‌ కు అనూహ్య స్పందన

16-10-2019

యూఎస్‌ కాన్సులేట్‌ సేఫ్‌ విలేజ్‌ కు అనూహ్య స్పందన

హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌, మై చాయిస్‌ సంస్థతో కలిసి నిర్వహిస్నుత్న సేఫ్‌ విలేజ్‌ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తున్నది. మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వంద గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ జోయెల్‌ రిఫ్మన్‌ ప్రారంభించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన రెండోరోజు విశాఖపట్నం సమీప సబ్బవరంలో నిర్వహించిన సమావేశంలో వందలమంది గ్రామస్థులు వలంటీర్లుగా, రక్షకులుగా పేర్లు నమోదు చేయించుకున్నట్టు నిర్వాహకులు తెలిపారు.