బుకర్‌ ప్రైజ్‌ విజేతలు వీరే....

15-10-2019

బుకర్‌ ప్రైజ్‌ విజేతలు వీరే....

ఆంగ్ల సాహిత్య రచయితలకు ఇచ్చే బుకర్‌ ప్రైజ్‌ ఈసారి ఇద్దర్ని వరించింది. మార్గరెట్‌ ఆట్‌వుడ్‌, బెర్నార్డినీ ఎవరిస్టోలకు ఈ యేటి బుక్‌ పురస్కారాన్ని పంచుకున్నారు. ఫిక్షన్‌ క్యాటగిరీలో ఇద్దరు రచయితలకు బూకర్‌ ప్రైజ్‌ను ప్రకటించడం ఇదే మొదటిసారి. లండన్‌లో జరిగిన ఈ వెంట్‌లో ఇద్దరూ ఆ అవార్డును అందుకున్నారు. ఆట్‌వుడ్‌ రాసిన ద టెస్టామెంట్స్‌, ఎవరిస్టో రాసిన గర్ల్‌, వుమెన్‌, అదర్‌ నవలలకు ఈ అవార్డులు దక్కాయి. ఈ ఇద్దరు 50 వేల పౌండ్ల ప్రైజ్‌మనీ పంచుకుంటారు. 79 ఏళ్ల వయపసులో ఆట్‌వుడ్‌ బూకర్‌ గెలుచుకోగా..తొలిసారి ఈ అవార్డును గెలుచుకున్న నల్లజాతి మహిళగా ఎవరిస్టో నిలిచింది. వాస్తవానాకి ప్రతి ఏడాది బుక్‌ ప్రైజ్‌ను ఒక్కరికి మాత్రమే ప్రకటిస్తారు. కానీ ఈసారి ప్యానల్‌ జడ్జీలు బహుమతిని ఇద్దరికీ పంచేందుకు నిర్ణయించారు.