రాజకీయ కారణాలతో వారు ఈ నిర్ణయం : వైట్‌హౌస్‌

10-10-2019

రాజకీయ కారణాలతో వారు ఈ నిర్ణయం : వైట్‌హౌస్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై డెమోక్రాటిక్‌ పార్టీ సభ్యులు ప్రవేశపెట్టిన అభిశంసనకు సహకరించేది లేదని వైట్‌హౌస్‌ ప్రకటించింది. అభిశంసన ప్రతిపాదిస్తున్న సభ్యులు ఇప్పటివరకు ప్రతినిధుల సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదని తెలిపింది. న్యాయవాది పాట్‌ సిపోల్లోనె ఈ మేరకు డెమోక్రాటిక్‌ పార్టీ నేతలకు 8 పేజీల లేఖ రాశారు. అధ్యక్షుడు ఎలాంటి తప్పు చేయలేదన్న అంశం డెమోక్రాట్లకు తెలుసు. పూర్తి రాజకీయ కారణాలతో మాత్రమే వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. 2016 ఎన్నికల ఫలితాలను తారుమారు చేయాలనే కోరికతో ఉన్నారు. ప్రతి అమెరికన్‌కు ఉన్న ప్రాథమిక హక్కును అభిశంసన ద్వారా ఉల్లఘింస్తున్నారు అని వైట్‌హౌజ్‌ మీడియా కార్యదర్శి స్టెఫానీ గ్రీషమ్‌ అన్నారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన రాజకీయ ప్రత్యర్థిగా పోటీ చేసే జో బిడెన్‌పై అవినీతి ఆరోపణలు చేసి విచారణ ప్రారంభించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడిపై ఒత్తిడి తెచ్చారని ట్రంప్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.