రష్యా ఫ్రీ ఈ-వీసా

05-10-2019

రష్యా ఫ్రీ ఈ-వీసా

పర్యాటకులను ఆకర్శించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. పర్యాటకులను ఆకర్శించే విషయంలో వ్లాదిమిర్‌ పుతిన్‌ ఈ ప్రక్రియను మరింత సులభతరం చేశారు. 53 దేశాల ప్రజలు రష్యాను సందర్శించేందుకు కేవలం 96 గంటల్లోనే అన్నీ అనుమతులు పొందేలా ఈ-వీసా పద్ధతిని అక్టోబర్‌ 1 నుంచి తీసుకొచ్చారు. ఓ ప్రత్యేకమైన యాప్‌ ద్వారా ఈ ప్రక్రియను ఎంతో సులవుగా పూర్తి చేసుకోవచ్చు. ఫీజు కూడా 50 డాలర్ల కంటే తక్కువే ఖర్చు కావడం విశేషం. ఎంతో కఠిన నిబంధనలు ఉన్న సౌదీ అరేబియాలాంటి దేశం కూడా పర్యాటకులను ఆకర్శిస్తున్న సమయంలో రష్యా తీసుకున్న ఈ నిర్ణయం సందర్శకులను మరింత పెరిగేందుకు దోహదపడుతుంది. పేపర్‌లెస్‌ వీసాలను 2035 నాటికి రెట్టింపు చేసి 29 బిలియ్‌ డాలర్ల ఆదాయం పొందాలని రష్యా పర్యాటక శాఖ యోచిస్తోంది.