కంటి కేన్సర్‌ను గుర్తించే యాప్‌

05-10-2019

కంటి కేన్సర్‌ను గుర్తించే యాప్‌

కంటి కేన్సర్‌ను మొదటి దశలోనే గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా స్మార్ట్‌ ఫోన్‌ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌ పేరు క్రాడల్‌ (కంప్యూటర్‌ అసిస్టెడ్‌ డిటెక్టర్‌ ల్యూకోకోరియా). ఇది ఫొటోలను స్కాన్‌ చేసి కంటికి సంబంధించిన వ్యాధులను తెలియజేస్తుంది. ముఖ్యంగా రెటీనాపై తెల్లని పొర ఏర్పడటాన్ని ఇది ముందుగానే పసిగడుతుంది. కంటీ కేన్సర్‌ రెటీనోబ్లాస్టోమా కు సంబంధించి మొదటి దశలో రెటీనాపై తెల్లని పొర ఏర్పడుతుంది. ఈ యాప్‌తో దానిని ముందుగానే గుర్తించి తగిన చికిత్స అందిచవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.