తానా ఉమెన్స్ ఫోరం ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు

24-05-2017

తానా ఉమెన్స్ ఫోరం ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు

తానా మహాసభల్లో భాగంగా ఉమెన్స్‌ఫోరం కమిటీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మహిళలకు ఉపయోగపడే పలు ఆరోగ్య సమస్యలపై సూచనలు ఇచ్చేందుకు నిపుణులైన డాక్టర్లను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. బ్రీస్ట్‌ క్యాన్సర్‌ నివారణపై డాక్టర్‌ దీపావళి హలహర్వి ప్రసంగించనున్నారు. డాక్టర్‌ కల్పన రఘునాథ్‌, డాక్టర్‌ లక్ష్మీ సలీమ్‌, డా. నీరజ నాయుడు చవకుల, డా. సునీత మన్యం, అరుణ టైలర్‌, జయశ్రీ తెలుకుంట తదితరులు ఈ కార్యక్రమాల్లో వివిధ అంశాలపై ప్రసంగించనున్నారు.