మిల్ పిటాస్ లో శివప్రసాద్ కు ఘనంగా నివాళులు

23-09-2019

మిల్ పిటాస్ లో శివప్రసాద్ కు ఘనంగా నివాళులు

మిల్‌పిటాస్‌లో తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎంపి, సినీనటుడు నారమల్లి శివప్రసాద్‌ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఎన్నారై టీడిప అభిమానులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. మిల్‌పిటాస్‌లోని స్వాగత్‌ హోటల్‌లో జరిగిన ఈ?కార్యక్రమంలో పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, ఎన్నారై టీడిపి నాయకుడు జయరామ్‌ కోమటి తదితరులు మాట్లాడుతూ, పార్టీకి, రాష్ట్రానికి శివప్రసాద్‌ ఎన్నో సేవలను అందించారని కొనియాడారు. ఆయన మరణం పార్టీకి, రాష్ట్రానికి తీరనిలోటని చెప్పారు. ఈ కార్యక్రమంలో వెంకట్‌ కోగంటి, విజయ గుమ్మడి, గాంధీ పాపినేని, రాజా కొల్లి, ప్రసాద్‌ మంగిన, భక్త బల్లా, రజనీకాకర్ల, రామ్‌, సుబ్బ యంత్ర, కోనేరు శ్రీకాంత్‌, శ్రీని వల్లూరి పల్లి, సతీష్‌, భాస్కర్‌ వల్లభనేని, హేమ, రాజు, వెంకయ్య దుక్కపాటి తదితరులు పాల్గొన్నారు.

Click here for Photogallery