మోదీని కలిసిన 16 ఏళ్ల భారత సంతతి బాలుడు

23-09-2019

మోదీని కలిసిన 16 ఏళ్ల భారత సంతతి బాలుడు

ప్రధాని నరేంద్ర మోదీని కలవడమనేది ఆ 16 ఏళ్ల భారత సంతతి బాలుడి ఆకాంక్ష. గంలో మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌లో మోదీని చూశాడే తప్ప కలిసే అవకాశం దక్కలేదు. ఇప్పుడా అబ్బాయి మోదీని కలిశారు. ఆయన సమక్షంలో జాతీయ గీతాన్ని కూడా పాడాడు. హౌడీ మోదీ కార్యక్రమంలో స్పర్శ్‌ షా అనే బాలుడికి దక్కిన అదృష్టమిది. వేదికపైకి వీల్‌చైర్‌లో వచ్చిన స్పర్శ్‌ రాగయుక్తంగా జనగణమనను ఆలపించాడు. స్పర్శ్‌ అత్యంత అరుదైన బ్రిటిల్‌ బోన్‌ వ్యాధి తో బాధపడుతున్నాడు. ఈ వ్యాధిగ్రస్థులకు ఎముకలు పెళుసుగా మారి విరిగిపోతుంటాయి. అతడు బహుముఖ ప్రజ్ఞాశాలి. 6 దేశాల్లో 125 ప్రదర్శనలిచ్చాడు. ప్రతిష్టాత్మకమైన గ్లోబల్‌ ఇండియన్‌ అవార్డును పొందాడు.