అమెరికా సీఈవోలతో ప్రధాని మోదీ భేటీ

23-09-2019

అమెరికా సీఈవోలతో ప్రధాని మోదీ భేటీ

అమెరికాకు చెందిన చమురు, సహజ వాయువు రంగ కంపెనీల సీఈవోలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. భారత్‌లో పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చే లక్ష్యంతో ఈ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడంపై వారితో చర్చించారు. ఇంధన భద్రత, భారత్‌-యూఎస్‌ మధ్య పరస్పర పెట్టుబడి అవకాశాల పెంపుపై మాట్లాడారు. మొత్తం 17 సంస్థల సీఈవోలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారత ఆర్థిక సరళీకరణ విధానాలను సీఈవోలు ప్రశంసించారు.