సౌదీ ప్రత్యేక విమానంలో అమెరికాకు ఇమ్రాన్‌

23-09-2019

సౌదీ ప్రత్యేక విమానంలో అమెరికాకు ఇమ్రాన్‌

 

 

సౌదీ యువరాజు పంపించిన ప్రత్యేక విమానంలో పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అమెరికాకు చేరుకున్నారు. ఇమ్రాన్‌ తనకు ప్రత్యేక అతిథి అని పేర్కొన్న యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఈ విమానాన్ని పంపించారు. సాధారణ వాణిజ్య విమానంలో అమెరికాకు వెళ్లవద్దని ఇమ్రాన్‌కు యువరాజు సూచించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో నేడు ఇమ్రాన్‌ భేటీ కానున్నారు. ఐక్యరాజ్య సమితిలోనూ మోదీ ప్రసంగించిన తరువాత ఇమ్రాన్‌ ఉపన్యసించనున్నారు. మునుపెన్నడూ లేని విధంగా కశ్మీర్‌పై బలంగా వాదనలు వినిప్తానని ఆయన ఇదివరకే చెప్పారు.