సూపర్‌ 30 ఆనంద్‌కు అమెరికా పురస్కారం

20-09-2019

సూపర్‌ 30 ఆనంద్‌కు అమెరికా పురస్కారం

సూపర్‌ 30 సంస్థ వ్వవస్థాపకుడు, ప్రముఖ గణితవేత్త ఆనంద్‌ కుమార్‌ అమెరికా ప్రతిష్టాత్మక బోధనా పురస్కారాన్ని అందుకున్నారు. దేశంలో అణగారిన, వెనుకబడిన, పేద విద్యార్థులకు విద్యను అందించడంలో ఆయన సేవలను గుర్తించిన అమెరికా ఎడ్యుకేషన్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డ్‌-2019ను ఆయనను ఎంపిక చేసింది. కాలిఫోర్నియాలోని శాన్‌ జోస్‌కు చెందిన ఫౌండేషన్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ (ఎఫ్‌ఎఫ్‌ఈ) సంస్థ తన 25వ వార్షికోత్సవం సందర్భంగా ఈ అవార్డును ఆనంద్‌కుమార్‌కు ప్రదానం చేసింది. ఆనంద్‌ కుమార్‌ గత 18 సంవత్సరాలుగా సూపర్‌ 30 సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఏటా భారత ఐఐటీల్లో ప్రవేశాలు కోరే 30 పేద విద్యార్థులకు ఉచిత రెసిడెన్షియల్‌ కోచింగ్‌ను అందిస్తున్నారు.