సోషల్‌ మీడియా, టివికి దూరంగా ఉండాలి : ఒబామా

20-09-2019

సోషల్‌ మీడియా, టివికి దూరంగా ఉండాలి : ఒబామా

అమెరికాలో మరికొన్ని నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోషల్‌ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాకు, టివికి దూరంగా ఉండాలని మాజీ అధ్యక్షుడు ఒరాక్‌ ఒబామా అన్నారు. ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన తాను అధ్యక్షుడిగా ఉన్ననప్పుడు సమయాన్ని సద్వినియోగం ఎలా చేసుకున్నానో తెలిపారు. పేరు ప్రస్తావించకుండా ట్రంప్‌కు చురకలు అంటించారు. టివిలు చూడకుండా, సోషల్‌ మీడియాకు దూరంగా ఉండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ రోజుల్లో అలా ఉండడటం చాలా అరుదు అంటూ ఒబామా పేర్కొన్నారు.