క్యాటలినా ఛానెల్‌ను ఈదిన తెలుగు తేజం

18-09-2019

క్యాటలినా ఛానెల్‌ను ఈదిన తెలుగు తేజం

అమెరికాలోని క్యాటలినా ఛానల్‌ను ఈదిన తెలుగు రాష్ట్రాల తొలి స్విమ్మర్‌గా విజయవాడకు చెందిన మోతుకూరి తులసీ చైతన్య చరిత్ర సృష్టించారు. విజయవాడ నగర పోలీసు కమిషనరేట్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఆయన ఈ నెల 16న క్యాటలినా ద్వీపం నుంచి రాంఛొపాలొ వెర్డిస్‌ వరకు 35 కి.మీ. పైగా ఉన్న దూరాన్ని 12 గంటల 40 నిమిషాల వ్యవధిలో అధిగమించారు. క్యాటలినా ఛానల్‌ను ఈదే సమయంలో పలు అవాంతరాలను ఎదుర్కొన్న చివరికి లక్ష్యం సాధించడం ఆనందంగా ఉందని తులసీ చైతన్య పేర్కొన్నారు.