అమెరికన్‌ స్విమ్మర్‌ ప్రపంచ రికార్డు

18-09-2019

అమెరికన్‌ స్విమ్మర్‌ ప్రపంచ రికార్డు

కేన్సర్‌ వ్యాధిని జయించిన సారా థామస్‌ (37)కు ఇంగ్లిష్‌ చానల్‌కు నాలుగు సార్లు ఈదేసి సంచలనం సృష్టించింది. అమెరికాలోని కొలరాడోకు చెందిన ఆమె ఏకబిగిన 54 గంటల్లో నాలుగు సార్లు చానల్‌ను ఈదేసింది. తొలిసారి ఈ రికార్డు సాధించిన స్విమ్మర్‌గా చరిత్ర సృష్టించింది. బ్రిటన్‌ దక్షిణ తీరంలోని షేక్‌స్పీయర్‌ బీచ్‌ నుంచి ప్రారంభించి డోవర్‌ పోర్టుకు చేరింది. ఆమె బ్రెస్ట్‌ కేన్సర్‌కు చికిత్స చేయించుకున్న ఏడాదికే ఈ ప్రపంచ రికార్డు సాధించడం విశేషం. చలిని తట్టుకుంటూ, జెల్లీఫిష్‌లను తప్పించుకుంటూ, ఆలసటను అధిమించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందని నార్త్‌ పోల్‌ను తొలిసారిగా ఈదిన ప్రముఖ ఈతగాడు లూయిస్‌ పూ ప్రశంసించారు.