జర్నలిస్టు కోకీ రాబర్ట్స్‌ ఇకలేరు

18-09-2019

జర్నలిస్టు కోకీ రాబర్ట్స్‌ ఇకలేరు

ప్రఖ్యాత జర్నలిస్టు, రాజకీయ వ్యాఖ్యాత కోకీ రాబర్ట్స్‌ (75) కన్ను మూశారు. కొన్నాళ్లుగా ఆమె రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్నారు. అమెరికాలో పేరుమోపిన మహిళా జర్నలిస్టులో కోకీ ఒకరు. 1960లో నేషనల్‌ పబ్లిక్‌ రేడియోలో పాత్రికేయ జీవితాన్ని ఆరంభించిన ఆమె.. నాలుగు దశాబ్దాల పాటు రేడియో, టీవీ, ప్రింట్‌ జర్నలిస్టుగా అత్యుత్తమ సేవలందించారు. కోకీ ప్రధానంగా అమెరికా అధ్యక్ష భవనం, కాంగ్రెస్‌ రిపోర్టర్‌గా ప్రపంచఖ్యాతి నార్జించారు. 1996-2002 మధ్య కాలంలో కోకీ శామ్‌ డోనాల్డ్‌సన్‌తో కలిసి ప్రసారం చేసిన వీక్లీ రాజకీయ షో దేశ ప్రజలను ఆకట్టుకునేది.