త్వరలో ఆ రెండు దేశాల ప్రధానులతో భేటీ అవుతా

18-09-2019

త్వరలో ఆ రెండు దేశాల ప్రధానులతో భేటీ అవుతా

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రికత్తలను తగ్గించడంలో చాలా పురోగతి సాధించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. త్వరలో ఆ రెండు దేశాల ప్రధానులతో భేటీ కానున్నట్లు చెప్పారు. ఈ నెల 22న హ్యూస్టన్‌లో హౌదీ మోదీ అనే సభలో భారత ప్రధాని నరేంద్రమోదీతో కలిసి భారత సంతతి అమెరికన్లను ఉద్దేశించి మాట్లాడనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత- అమెరికా సంతతి సభ్యులు కీలక పాత్ర పోషిస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే అధికార రిపబ్లికన్‌ పార్టీ తమ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్‌ పేరును ఖరారు చేసింది. వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో ఎక్కడ భేటీ అవుతారన్న సంగతిని వెల్లడించలేదు. ట్రంప్‌ షెడ్యూల్‌ ప్రకారం ఈ నెలాఖరులో న్యూయార్క్‌లో ఐరాస సాధారణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌తో భేటీ అయ్యే అవకాశం ఉన్నది.