నా ప్రసంగానికి మీ సూచనలివ్వండి..మోదీ

17-09-2019

నా ప్రసంగానికి మీ సూచనలివ్వండి..మోదీ

అమెరికాలోని హ్యూస్టన్‌ వేదికగా జరగబోయే హౌదీ-మోదీ కార్యక్రమానికి ఎంతో ఆత్రుతగా చూస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భంగా తన ప్రసంగానికి సంబంధించి దేశ ప్రజలు సలహాలు, సూచనలు అందించాలని ట్వీటర్‌ వేదికగా కోరారు. 22న హ్యూస్టన్లో జరగబోయే హౌదీ మోదీ కార్యక్రమం కోసం ఆసక్తిగా వేచిచూస్తున్నాను. ఆరోజున నేనేం మాట్లాడాలో మీ ద్వారానే తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకు సలహాలు, సూచనలు ఇవ్వండి. నా ప్రసంగంలో నేను వాటిని ప్రస్తావిస్తాను. నమో యాప్‌లోని స్పెషల్‌ ఫోరం ద్వారా మీ ఆలోచనల్ని పంచుకోండి అని ట్విటర్‌లో మోదీ కోరారు.