అదే జరిగితే చరిత్రాత్మకం, అపూర్వం : 'హోడీ మోడీ' సభపై హర్ష వర్ధన్

17-09-2019

అదే జరిగితే చరిత్రాత్మకం, అపూర్వం : 'హోడీ మోడీ' సభపై హర్ష వర్ధన్

ఈ నెల 22న హ్యూస్టన్‌ లోని భారీ స్టేడియంలో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి, ప్రధాని నరేంద్ర మోదీ 'హౌడీ మోదీ' ( హౌ డు యు డూ మోడీ) కార్యక్రమంలో ప్రసంగించనుండగా, ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇప్పటికే 50 వేల మందికిపైగా రిజిస్టర్‌ చేయించుకున్నారు. ఇక, ఈ కార్యక్రమానికి పలువురు యూఎస్‌ ప్రజా ప్రతినిధులతో పాటు, ట్రంప్‌ కూడా హాజరవుతారని ఫారిన్‌ మీడియా అంటున్న వేళ, అదే జరిగితే, ఈ ఘటన ఓ అద్భుతమవుతుందని, చరిత్రలో నిలిచిపోతుందని యూఎస్‌ లో భారత అంబాసిడర్‌ హర్ష వర్థన్‌ ష్రింగ్లా అభివర్ణించారు. ఇదరు నేతలు ఈ వేదికపై కలిస్తే మాత్రం అది చారిత్రాత్మకమేనని, అమెరికా అభివృద్ధిలో భారత్‌ పాత్రను అంగీకరించినట్టేనని అన్నారు. రెండు దేశాల మధ్య ముఖ్యంగా మోదీ, ట్రంప్‌ల మధ్య స్నేహ బంధం మరింతగా పెరగుతుందని ష్రింగ్లా అభిప్రాయపడ్డారు.