వారిని శిక్షించేందుకు సిద్ధం : ట్రంప్‌

17-09-2019

వారిని శిక్షించేందుకు సిద్ధం : ట్రంప్‌

సౌదీలోని కీలక చమురు క్షేత్రాలపై దాడులకు దిగిన వారిని శిక్షించేందుకు సిద్దంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. అసాధారణ రీతిలో జరిగిన డ్రోన్‌ దాడులపై తీవ్రంగా స్పందించాల్సి వస్తోందని, ఇందుకు అన్ని విధాలుగా సిద్దంగా ఉన్నట్లు ట్రంప్‌ తెలిపారు. తాము లాక్డ్‌ అండ్‌ లోడెడ్‌ అని ప్రకటించారు. ఇరాన్‌ చేష్టలతోనే ఇప్పటి డ్రోన్‌ దాడులు జరిగాయని ఒక్కరోజు క్రితమే అమెరికా దౌత్యవేత్త ఒకరు స్పందించారు. గల్ఫ్‌ అంతర్యుద్ధం నాటి ముడిచమురు ధరలు పెరుగుతూ ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ట్రంప్‌ నుంచి ఈ దాడుల పట్ల తీవ్ర స్పందన వెలువడింది. సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ చమురు శుద్ధి కర్మాగారాలను లక్ష్యంగా చేసుకొని యెమెన్‌ హైతీ రెబెల్స్‌ దాడులు సాగించారు. దీనితో ప్రపంచ దేశాలకు సౌదీనుంచీ చమురు సరఫరాలు సగం తగ్గాయి.

.