డొనాల్డ్‌ ట్రంప్‌కు కిమ్‌ ఆహ్వానం

17-09-2019

డొనాల్డ్‌ ట్రంప్‌కు కిమ్‌ ఆహ్వానం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను మరోసారి తమ దేశానికి రావాలని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కోరారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడికి కిమ్‌ గత నెలలో రెండు సార్లు లేఖ రాసినట్టు దక్షిణ కొరియా స్టేట్‌ మీడియా ప్రకటించింది. ట్రంప్‌తో మరోసారి భేటీకి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని ఆగస్టు నెలాఖరులో రాసిన రెండో లేఖలో కిమ్‌ పేర్కొన్నట్టు ఆ మీడియా తన కథనంలో పేర్కొంది. అయితే కిమ్‌ ఆహ్వానంపై అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం గానీ, ఆ దేశ విదేశాంగశాఖ గానీ ఇంకా స్పందించలేదు. కిమ్‌ రాసిన తొలి లేఖపై ట్రంప్‌ స్పందిస్తూ.. కిమ్‌ నుంచి అందమైన లేఖ అందింది. త్వరలోనే మా మధ్య మరో సమావేశం జరిగే అవకాశం ఉంది అని పేర్కొన్నారు. ఈ ఏడాది ట్రంప్‌, కిమ్‌ మధ్య జరిగిన భేటీ విఫలమైంది.