హైదరాబాద్‌లో న్యూడెసిక్‌ ఇన్నోవేషన్‌ కేంద్రం

17-09-2019

హైదరాబాద్‌లో న్యూడెసిక్‌ ఇన్నోవేషన్‌ కేంద్రం

కాలిఫోర్నియాకు చెందిన ఐటీ కన్సల్టింగ్‌ కంపెనీ న్యూడెసిక్‌ గ్లోబల్‌ సర్వీస్‌- హైదరాబాద్‌లో రెండో ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. హెల్త్‌కేర్‌, యుటిలిటీస్‌ పరిశ్రమల్లో ప్రపంచవ్యాప్తంగా కంపెనీకి ఉన్న ఖాతాదారుల నుండి డిమాండ్‌ పెరుగుతున్న కారణంగా హైదరాబాద్‌లో రెండో కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు న్యూడెసిక్‌ గ్లోబల్‌ సర్వీస్‌ సీఈఓ అశిక్‌ అగర్వాల్‌ తెలిపారు. హైదరాబాద్‌లో తాజాగా ఏర్పాటు చేసిన కేంద్రం కంపెనీకి భారత్‌లో నాలుగో కేంద్రం అవుతుంది. 2006లో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీకి ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్‌, కోచిల్లో కేంద్రాలు ఉన్నాయి. భారత్‌లో నిపుణులను 750 మందికి పెంచుకోవాలని భావిస్తున్నట్లు అగర్వాల్‌ తెలిపారు. కార్యక్రమంలో న్యూడెసిక్‌ వీపీ (స్ట్రాటజీ, ఆపరేషన్స్‌) సుమన్‌ చొప్పాల, టెక్నాలజీ డైరెక్టర్‌ జోయిల్‌ జోలి తదితరులు పాల్గొన్నారు.