అమెరికా మార్కెట్‌లోకి లాన్సోప్రజోల్‌

17-09-2019

అమెరికా మార్కెట్‌లోకి లాన్సోప్రజోల్‌

గుండెల్లో మంట తదితరాల చికిత్స కోసం వినియోగించే లాన్సోప్రజోల్‌ డిలేడ్‌ రిలీస్‌ గొట్టాలను అమెరికా మార్కెట్‌లోకి డాక్టర్‌ రెడ్డీస్‌ ప్రవేశపెట్టింది. ఓవర్‌ ద కౌంటర్‌ (ఓటీసీ) స్టోర్‌ బ్రాండ్‌ అయిన ప్రీవాసిడ్‌ 24 హెచ్‌ఆర్‌ గొట్టాలకు డాక్టర్‌ రెడ్డీస్‌ ఔషధం సమానమైంది. అమెరికాలో యాంటాసిడ్లు, పీపీఐ ఔషధాల పోర్టు ఫోలియోను పెంచుకునే వ్యూహంలో భాగంగా లాన్సోప్రజోల్‌ను ప్రవేశపెట్టినట్టు డాక్టర్‌ రెడ్డీస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ యూఎస్‌ ఓటీసీ అధిపతి మిలాన్‌ కలావాడియా తెలిపారు. 2019 ఆగస్టుతో ముగిసిన ఏడాదికి అమెరికా మార్కెట్‌లో ప్రీవాసిడ్‌ విక్రయాలు దాదాపు 5.7 కోట్ల డాలర్లు ఉన్నట్లు అంచనా. 15 ఎంజీ మోతాదులో లాన్సోప్రజోల్‌ గొట్టాలను డాక్టర్‌ రెడ్డీస్‌ అమెరికా ఓటీసీ మార్కెట్‌లో విక్రయిస్తుంది.