అమెరికాలోను జేఈఈ అడ్వాన్స్‌డ్‌

17-09-2019

అమెరికాలోను జేఈఈ అడ్వాన్స్‌డ్‌

ఐఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ) అడ్వాన్స్‌డ్‌ని వచ్చే ఏడాది నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఐఐటీ జేఈఈ (అడ్వాన్స్‌డ్‌) పరీక్షను యూఏఈలోని దుబాయ్‌, నేపాల్‌ రాజధాని కాఠ్‌మాండూ, ఇథియోపియా రాజధాని ఆడిస్‌ అబాబా, శ్రీలంక రాజధాని కొలంబో, బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా, సింగపూర్‌లలో నిర్వహించారు. తొలిసారిగా వచ్చే ఏడాది అమెరికాలో నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.